సోమవారం రోజు శివుడికి వీటిని సమర్పిస్తే చాలు.. జీవితంలో ఎన్ని కష్టాలున్నా తొలగిపోవడం ఖాయం..
సనాతన ధర్మంలో శివుడిని దేవాధిదేవుడు, మహాదేవుడు, పరమేశ్వరుడు ఇలా ఏన్నో పేర్లతో పిలుస్తారు. శివుని ఆశీర్వాదం పొందిన ఏ వ్యక్తి అయినా జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని పురాణాలు, కథనాలు చెబుతున్నాయి. కేవలం సమస్యల విముక్తే కాదు.. కోరికలన్నీ నెరవేరుతాయని అంటారు. అయితే వీటన్నింటికి శివుడి అనుగ్రహం అవసరం. శివుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందాలనుకుంటే సోమవారం శివుడికి ఈ కింది వస్తువులను సమర్పించడం ద్వారా ఆయనను మెప్పించి ఆయన కరుణ పొందవచ్చు.
చెంబుడు నీళ్ళు, ఓ మారెడు దళం, కాస్త వీభూతి సమర్పిస్తే చాలు, శివుడు ఎంతో ఆనందిస్తాడు. ఈ కారణంతోనే ఆయన్ను భోళాశంకరుడు అని అంటారు. కానీ ఇతర గ్రహాల ప్రభావం, ఇతర సమస్యలు తొలగిపోవాలంటే మాత్రం కొన్ని ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శివుడి కృప పొందడం ద్వారా సమస్యలు అధిగమించవచ్చు.
కోరికలు నెరవేరాలంటే సోమవారం రోజు శివుడికి పెసరపప్పు నైవేద్యం పెట్టాలి. అలాగే మినపపప్పు కూడా నైద్యంగా పెడితే శనిబాధలు ఉన్నవారికి ఆ సమస్యతొలగిపోతుంది.
కొందరు కష్టపడి పనిచేసినా ఫలితం ఉండటం లేదని అంటుంటారు. అలాంటి వారు సోమవారం శివుడికి పప్పు దినుసులను సమర్పించడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి. అదృష్ణం కలసివస్తుంది.
శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే శివలింగానికి ఆవాల నూనె రాయాలి. ఇలా చేస్తే శత్రువులు అంతం అవుతారు. అదేవిధంగా అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే శివలింగానికి ఎర్రకందిపప్పు సమర్పించాలి.
జీవితంలో సంతోషం, కుటుంబ సభ్యుల మధ్య ఆనందం వెల్లివిరియాలంటే సువాసనతో కూడిన తైలాన్ని శివుడికి సమర్ఫించాలి. అదే విధంగా వైవాహిక జీవితంలో సంతోషం, భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారం కావాలంటే శివుడికి కుంకుమార్చన చేయించుకోవాలి. ఇక వ్యక్తి గౌరవం, సమాజంలో అతని కీర్తి పెరగాలంటే చందనాన్ని శివుడికి సమర్పించడం వల్ల ఆ కోరిక నెరవేరుతుంది.
*నిశ్శబ్ద.