సోమవారం ఈ పనులు చేస్తే శివుడు ప్రసన్నం అవుతాడు..!

 


వారంలో ఒక్కో దేవుడికి ఒక్కో రోజును ప్రత్యేకంగా చెబుతారు.  ముఖ్యంగా సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైనది.  శివుడు బోలా శంకరుడు అని ఆయన తొందరగా తన భక్తులను కరుణిస్తాడని అంటారు. అయితే సోమవారం రోజు కొన్ని పనులు చేయడం వల్ల పరమ శివుడు మరింత సులువుగా తన భక్తులను కరుణిస్తాడు. ఇందుకోసం ఏం చేయాలంటే..

సోమవారం శివుడికి చాలా పవిత్రమైన రోజు.  సోమవారం ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేయాలి.  పాలు, తెల్లని పువ్వులు,  అక్షింతలు కలిపిన నీటిని ఇంట్లో ఉన్న శివలింగం కు కానీ లేదా శివాలయంలో శివలింగానికి కానీ సమర్పించాలి. శివ తాండవ స్తోత్రం అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం.  భక్తితో శివ తాండవ స్తోత్రాన్ని పఠించాలి.  దీని తరువాత శివుడికి హారతి ఇవ్వాలి.

పై విధంగా సోమవారపు ఉదయాన్ని మొదలుపెడితే పరమేశ్వరుడు సంతోషిస్తాడు.  వీలున్న వారు శివాలయాల్లో రుద్రాభిషేకం కూడా చేయించుకోవచ్చు.  సోమవారం రోజున శివ పంచాక్షరీ మంత్ర జపం చేస్తే ఎంతో పుణ్యం.  బిల్వ పత్రాలను శివుడికి సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడు.  భస్మ అర్చన కూడా శివుడికి చాలా ప్రత్యేకమైనది.  భస్మంతో అర్చన చేయించడం వల్ల శివుడి కరుణ ఎప్పటికీ ఉంటుంది. శివ పూజకు ఆడంబరాల కంటే భక్తి ముఖ్యం.  భక్తి లేకుండా ఎంత ఆడంబరంతో పూజ చేసినా శివుడు కరుణించడు. భోగాలకు లొంగని వాడు, భక్తికి లొంగేవాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి  పూజను భక్తి శ్రద్దలతో చేస్తే శివుడు కరుణిస్తాడు.


                                                     *రూపశ్రీ.


More Shiva