మాస శివరాత్రి రోజు ఈ మూడు పనులు చేస్తే చాలు.. ఆర్థిక బాధలు తీరతాయి..!
శివరాత్రి శివ భక్తులకే కాకుండా యావత్ భారత ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు. రాత్రంతా మేలుకుని జాగరణ చేసి శివ పూజలలోనూ, శివ భజనలలోనూ లీనమై ఉంటారు. శివుడికి అభిషేకాలు, పూజలు శివరాత్రి రోజు జరుగుతాయి. ఏడాదికి ఒకసారి వచ్చే శివరాత్రి మాత్రమే కాకుండా ప్రతి నెలా ఒక శివరాత్రి వస్తుంది. దీన్నే మాస శివరాత్రి అంటారు. ప్రతి నెలా ఈ శివరాత్రి రోజున చేసే పనులు ఆర్థిక బాధల నుండి విముక్తిని ఇస్తాయట. ఇంతకీ ఆ రోజు ఏం చేయాలంటే..
మాస శివరాత్రి రోజు శివపార్వతులను పూజిస్తారు. నవంబర్ నెలలో మాస శివరాత్రి 29వ తేదీ వచ్చింది. ఈరోజు శివుడిని ఆరాధించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
మాస శివరాత్రి రోజు పెరుగులో తేనె కలిపి శివ లింగానికి అభిషేకం చెయ్యాలి. శివుడిని అభిషేక ప్రియుడు అని అంటారు. పెరుగులో తేనె కలిపి అభిషేకం చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడు. ఈ పని చేయడం వల్ల శివుడి ఆశీర్వాదం లభించి మద్యలో ఆగిపోయిన పనులు తిరిగి పూర్తీ అవుతాయట.
శివ పూజకు బిల్వపత్రం చాలా ముఖ్యం. ఈ రోజు బిల్వ పత్రం, పూలు, పండ్లు, పాలు, చందనం సమర్పించాలి. ఇలా చేస్తే పూజ చేసే వారి మీద శివుడి అనుగ్రహం ఉంటుంది.
శివుడు నిరాడంబరుడు, ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. ప్రతి నెలా మాస శివరాత్రి రోజు నిరుపేదలకు, బీద వారికి, సహాయం కోసం ఎదురు చూస్తున్నవారికి పాలు, పండ్లు, పప్పు ధాన్యాలు, బియ్యం వంటి నిత్యవసరాలు దానం చెయ్యాలి. ఇలా చేస్తే జీవితంలో దేనికి లోటు ఉండదట.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇంట్లో డబ్బు కొరత ఎదుర్కొంటున్నవారు ఇలా పేదలకు దాననం చేయడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి బలపడి జీవితంలో పురోగతి లభిస్తుందట.
*రూపశ్రీ.