హరితాళిక వ్రతం విశిష్టత ఏమిటి?

 

 

Special Article on Mangala Gowri Vratam Telugu This Vratam is known as Hartalika Vratam

 

 

కైలాస శిఖరమందు పార్వతి ఒకనాడు పరమశివుడిని ఇలా అడిగింది - ‘‘స్వామీ! తక్కువ శ్రమతో, ధర్మాచరణతో ఎవరు నిను భక్తిక్షిశద్ధలతో సేవిస్తారో వారికెలా ప్రసన్నుడవౌతావో తెలుపుమని ప్రార్థించింది. అంతేకాక, జగవూత్పభువైన మీరు నాకు యే తపోదాన వ్రతమాచరించుటచే లభించారు’’ అని అడిగింది. ప్రసన్నవదనంతో పరమశివుడు ‘‘దేవీ! వ్రతాల్లోకి చాలా ఉత్తమమైంది, అత్యంత రహస్యమైన వ్రతమొకటున్నది. దాన్నెవరాచరించినా నేను వారికి వశుడనైతాను. భాద్రపద శుక్లపక్షంలో హస్తనక్షవూతంతో కూడిన తదియయందీ వ్రతాన్నాచరించినవారు సర్వపాప విముక్తులవుతారు. ‘‘దేవీ! నీవు నీ చిన్ననాట హిమాలయాల్లో ఈ మహా వ్రతాన్ని ఎలా ఆచరించాలో చెబుతాను. విను!’ అన్నాడు.

 

 

Special Article on Mangala Gowri Vratam Telugu This Vratam is known as Hartalika Vratam

 

 

భూలోకమున వివిధ పక్షులతో, విచిత్ర మృగాలతో మంచుచేత కప్పబడి బహుసుందరమైన హిమవత్పర్వతము కలదు. హిమవంతుడా ప్రాంతానికి ప్రభువు. నీవాతని కూతురువు. చిన్నతనం నుంచే శివభక్తురాలవు. యుక్తవయసు వస్తున్న నీకు వరుడెవరగునా?యని హిమవంతుడాలోచించగా, త్రిలోక సంచారి నారద మునీశ్వరులొకనాడు మీ తడ్రి వద్దకు వచ్చాడు. అర్ఘ్య పాద్యాలందించి మీ తండ్రి నిను చూపి, ఈ కన్యనెవరికిచ్చి వివాహం చేయవపూను? తగిన వరుడెవరని నారదుని అడిగినాడు. వెంటనే నారదుడు ‘ఓ గిరిరాజా! నీ కన్యారత్నమున కన్నివిధముల యోగ్యమైనవాడు బ్రహ్మాదిదేవతలలో విష్ణువు. అతడు పంపితేనే నీ వద్దకు వచ్చానన్నాడు’. సంతోషంతో హిమవంతుడు మునీందరా ఆ విష్ణుదేవుడే స్వయంగా ఈ కన్యను కోరి నినుపంపాడు కనుక గౌరవించి, అతనికిచ్చి వివాహం చేస్తానని వెంటనే తెలుపుమన్నాడు. నారదుడందుకంగీకరించి బయలుదేరాడు.

 

 

Special Article on Mangala Gowri Vratam Telugu This Vratam is known as Hartalika Vratam

 


హిమవంతుడానందంతో భార్యాపిల్లలకావిషయం తెలిపాడు. కుమార్తెను దగ్గరకు పిలిచి ‘ఓ పుత్రీ! గరడవాహనునితో నీ వివాహం నిశ్చయం చేస్తున్నానని’ తెలిపెను. ఆ మాటలు విని పార్వతి తన మందిరంలోకి వెళ్లి పొర్లిపొర్లి దుఃఖించసాగింది. ఇది చూసిన పార్వతి ప్రియసఖి ఆమె మనసా పెండ్లికి సుముఖంగా లేదని తెలుసుకుని స్నేహితురాలికొక ఉపాయం చెప్పింది. నీ త్రండి జాడ తెలియని అడవిలోకి మనమిద్దరం కొంతకాలం పారిపోదామని చెప్పింది. ఆమె అనుమతితో ఇద్దరూ వనవూపాంతానికి ప్రయాణమైనారు. కుమార్తె కనిపించుటలేదని గిరిరాజు హాహాకారాలు చేసి, ఏడ్చి మూర్ఛిల్లాడు. నీవు పరమశివుని గూర్చి ఘోర తపస్సు చేశావు. అడవిలో దొరికిన ఫలాలతో, పుష్పాలతో, పత్రాలతో అనేక విధాల పూజించావు. నీభక్తికి మెచ్చి సైకత లింగాన్ని (ఇసుక) చేసుకొని పూజిస్తున్న నీకు భాద్రపదశుక్ల తదియనాడు నేను ప్రసన్నుడైనాను.

 

 

Special Article on Mangala Gowri Vratam Telugu This Vratam is known as Hartalika Vratam

 


చెలికత్తెచే హరింపబడినావు కనుక ఈ వ్రతాన్ని ‘‘హరితాళిక వ్రతం’’ అంటారు. ఆరోజు శివరావూతివలె ఉపవసించి, రాత్రంతా జాగరణతో ఎవరైనా పరమశివుని సైకత లింగాన్ని పత్రపుష్పాలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు, సంపత్తులు కలుగుతాయి’’ అని పరమేశ్వరుడు పార్వతితో చెప్తాడు. 16 ఉత్తరేణి ఆకులతో 16 వరుసల దారాన్ని 16 గ్రంథులు ముళ్లు వేసి తోరానికి గ్రంథిపూజచేసి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం నోచుకోవాలి. తెల్లవారి వినాయక చవితిరోజు దంపతులకు భోజ, వస్త్ర, దక్షిణ తాంబూలాలతో పార్వతీ పరమేశ్వరులుగా భావించి పూజించాలి. ముత్తైదువలంతా చవితి తెల్లవారుఝామున మేళతాళాలతో సైకతలింగరూపంలోని సాంబశివుని దగ్గరలోని జలాశయంలో నిమజ్జన చేయాలని శివుడు పార్వతికి తెలియజేయాలి. కథ తప్పినా వాక్కు తప్పదు.


More Shiva