హిందూ క్యాలెండర్ లో శ్రావణ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది.  ఈ మాసంలో శ్రావణ శుక్రవారం మాత్రమే కాకుండా.. శ్రావణ శనివారం,  శ్రావణ సోమవారం కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  శివుడికి సోమవారం ప్రీతికరమైనది. శ్రావణ సోమవారం రోజు కొన్ని పనులు చేస్తే పరమశివుడు సంతృప్తి చెందుతాడని అంటున్నారు.  శ్రావణ సోమవారం రోజు ఏం చేయాలో తెలుసుకుంటే..


శ్రావణ సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోరికలు తీరతాయనే నమ్మకం ఉంది.  కేవలం కోరికలు మాత్రమే కాకుండా జీవితంలో కష్టాలు కూడా తొలగిపోతాయట.  అందుకే శ్రావణ సోమవారం రోజు భక్తితో ఉపవాసం చేయడం మంచిది.


శ్రావణ సోమవారం ఉపవాసం చేసేవారు కేవలం ఉపవాసం మాత్రమే కాకుండా కొన్ని  పరిహారాలు చేస్తే పరమ శివుడు ప్రసన్నుడవుతాడు.  సోమవారం రోజు గంగాజలంలో నల్ల నువ్వులు వేసి శివుడికి అభిషేకం చేయాలి.  ఇలా చేయడం వల్ల ఒత్తిడి సమస్య దూరమవుతుంది.


సోమవారం రోజు పంచదార, బియ్యం,  ఉప్పు, పాలు,  పెరుగు,  తెల్లని వస్త్రాలు దానం చేయాలి.  ఇలా దానం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు.

శ్రావణ సోమవారం రోజు కుదిరితే ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా చేస్తే మనిషి మానసిక స్థితి బలపడుతుంది.  దీనితోపాటు శివలింగానికి గంగాజలం కూడా సమర్పించాలి.


సోమవారం రోజు శివుడికి ఎంతో ప్రీతికరమైన ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలి. దీన్ని వీలైనన్ని సార్లు జపం చేయవచ్చు. అలాగే బిల్వపత్రాన్ని సమర్పించవచ్చు.


శ్రావణ సోమవారం రోజు పై నియమాలు,  పరిహారాలు పాటిస్తే తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.  ఇది మాత్రమే కాకుండా జీవితంలో పురోగతి ఉంటుంది.

                                              *రూపశ్రీ.


More Shiva