గ్రహాల అనుగ్రహం పొందే తేలికైన మార్గం

(Grahanugraham)


మనం పుట్టిన సమయంలో గ్రహాల తీరునుబట్టి మన జాతకం ఆధారపడి ఉంటుంది అంటారు. అంతేకాదు, పరిస్థితులు, మనస్తత్వాలు, కష్టాలు, నష్టాలు అన్నీ వాటిని బట్టే ఉంటాయంటారు. అందుకే, గ్రహాలను అనుకూలంగా మార్చుకోవడం కోసం నవగ్రహారాధన చేస్తాం. ఈ పూజలు, అర్చనలు, దానాల సంగతి అలా ఉంచితే అంతకంటే తేలికైన మార్గం ఇంకొకటి ఉంది. ఇది నిజంగా ఎంతమాత్రం కష్టంకాని విషయం. చేయాలి అనుకుంటే, ప్రతిఒక్కరూ పాటించదగ్గ నియమం.

ఏమిటా నియమం అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదూ! సరే వినండి. ఒక్కో వారానికీ ఒక్కో గ్రహం అధిపతి.

ఆదివారం – సూర్యుడు

సోమవారం – చంద్రుడు

మంగళవారం –కుజుడు

బుధవారం – బుధుడు

గురువారం – బృహస్పతి

శుక్రవారం – శుక్రుడు

శనివారం – శని

 

ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే, గ్రహాల అనుగ్రహం పొందేందుకు, ఆయా వారాల్లో మన దుస్తుల రంగులు ఇలా ఉండేలా చూసుకోవాలి.

ఆదివారం – ఎరుపు

సోమవారం – తెలుపు

మంగళవారం –నారింజ రంగు

బుధవారం – ఆకుపచ్చ

గురువారం – పసుపుపచ్చ

శుక్రవారం – తెలుపు

శనివారం – నీలం లేదా నలుపు రంగు


ఆయా గ్రహాలకు ఇష్టమైన రంగులను ఉపయోగించడంవల్ల, గ్రహాలూ మనపట్ల ఆకర్షితమై అనుకూలంగా ఉంటాయని, అనుకున్న పనులు ఎలాంటి విఘ్నాలూ లేకుండా సవ్యంగా జరుగుతాయని పండితులు చెప్తారు. ఇంత తేలికైన మార్గాన్ని అనుసరించలేమా?! పైగా ఇది చాలా హాయి కూడా. ఇవాళ ఏ దుస్తులు వేసుకోవాలి అని ఆలోచించనవసరంలేదు. సోమవారం అనగానే టక్కున తెల్లటి దుస్తులేవో వేసేసుకోవచ్చు. ఇతర వారాల్లోనూ అంతే!


More Enduku-Emiti