వంగపండు ఒక్కో పాటకు ఎంత తీసుకున్నారో తెలుసా?
on Aug 5, 2020
నవతరం ప్రేక్షకులకు 'ఏం పిల్లడో ఎల్ద మొస్తవా' అంటే 'మగధీర' సినిమాలో 'జోర్సే... జోర్సే' సాంగ్ మధ్యలో వచ్చే లైన్లు అనుకుంటారు. ఒక 30, 40 ఏళ్ల క్రితం ప్రజలను అడిగితే ఎంతమంది గుండెల్లో ఆ సాంగ్ విప్లవ శంఖం పూరించిందో చెబుతారు. శ్రీకాకుళంలో పీడిత ప్రజలలో చైతన్యం రగిలించిన గీతం 'ఏం పిల్లడో ఎల్ద మొస్తవా'. దీనికి ప్రజాకవి వంగపండు రాశారు. తరవాత ఆ పాటను 'అర్ధరాత్రి స్వతంత్రం' సినిమాలో ఆర్. నారాయణమూర్తి ఉపయోగించుకున్నారు. అప్పటి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణపై ఆ పాటను తెరకెక్కించారు. తరవాత మరో సినిమాలో కూడా వాడుకున్నారు.
విప్లవ గీతాలతో వంగపండుకు ప్రజాకవిగా విపరీతమైన గుర్తింపు లభించింది. అది సినిమా జనాలను ఆకర్షించింది. ఆయనతో పాటలు రాయించుకోవాలని చాలామంది విఫలయత్నాలు చేశారు. తన అభిప్రాయాలు, సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న కథలకు మాత్రమే వంగపండు పాటలు రాశారు. అందువల్ల, ఆయన సినిమా కెరీర్ లో సుమారు 30 సినిమాలు మాత్రమే ఉన్నాయి. అప్పట్లో వంగపండు ఒక్కో పాటకు ఎంత తీసుకున్నారో తెలుసా? వెయ్యి నుండి పదిహేను వందల రూపాయలు మాత్రమే. ఇప్పటికి లిరిక్ రైటర్లు కొందరు వేలు, లక్షల్లో అందుకుంటున్నారు. ఏనాడూ డబ్బు కోసం వంగపండు పాటలు రాయలేదు. ఆత్మసంతృప్తి కోసమే రాశారు.
Also Read