క్రేజీ తార కావాలంటున్న క్రికెటర్!
on Jun 25, 2015
శ్రీశాంత్ మాంచి గ్రంధసాంగుడన్న సంగతి తెలిసిందే కదా! బ్యాట్ పట్టుకున్నప్పుడే బ్యూటీలతో డేటింగుల్లో మునిగితేలాడు. క్రికెట్ కు ఎప్పుడైతే గుడ్ బై చెప్పేశాడో అప్పుడే ఇండస్ట్రీపై కన్నేశాడు. అందుకే డాన్స్, ఫైట్స్ కూడా నేర్చుకున్నాడు. త్వరలోనే ఓమూవీతో అదృష్టం పరీక్షించుకుంటానంటున్న శ్రీ....అందుకు తగ్గా సన్నాహాలు చేసుకుంటున్నాడట. అయితే ఫస్ట్ మూవీకే ఫాలోయింగ్ సంపాదించుకోవాలంటే....క్రేజీ హీరోయిన్ ని తీసుకోవాలని ఫిక్సయ్యాడట. తెలుగు, తమిళంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కాజల్, సమంత, తమన్నా లాంటి వాళ్లతే హైప్ వస్తుందనే ఆలోచనలో ఉన్నాడట. శ్రీ ఆలోచన బాగానే ఉందికానీ....ఆ ముద్దుగుమ్మలు ఒప్పుకుంటారా? అయినా వాళ్లుకూడా ఫేడవుట్ అయిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి కాసిన్ని కాసులు ఎక్కువిస్తే సై అంటారేమో? ఇంతకీ శ్రీతో రొమాన్స్ చేసేదెవరో వెయిట్ అండ్ సీ!