హీరోయిన్‌ని చితగ్గొట్టిన దర్శకుడి భార్య
on May 31, 2016
కలహాల కాపురాలు టాలీవుడ్‌లో మామూలే! ఇంట్లో ఇల్లాలు - సెట్లో ప్రియురాలు అన్న క్యాప్షన్ కొంతమంది కథానాయకులకు, దర్శకులకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఓ దర్శకుడు కూడా ఇలానే.. ఇంట్లోనూ, సెట్లోనూ తన రొమాన్స్ చూపించడం మొదలెట్టాడు. ఓ హీరోయిన్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ... ఆమెకు అవకాశాలు ఇస్తూ... ఆమె జీవితంలో భాగమైపోయాడు. ఎప్పుడైతే ఆ హీరోయిన్ వైపు నుంచి కూడా రెస్పాన్స్ మొదలైందో... సదరు దర్శకుడు ఇంటికి కూడా వెళ్లకుండా ఓ హోటెల్‌లోనే కాపురం పెట్టేశాడట. సినీ సెలబ్రెటీలకు.. అడ్డా ఆ హోటెల్. అక్కడే దర్శకుడు, హీరోయిన్ పక్క పక్కల రూమ్‌లు తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించుకొంటున్నారట.
అయితే సదరు దర్శకుడి భార్యకు ఈ విషయం ఏదోలా తెలిసిపోయింది. పెద్ద మనుషుల మధ్య.. పంచాయతీ పెట్టిందట. ఓసారి ఆ హోటెల్‌కి వెళ్లి.. గొడవ కూడా చేసొచ్చిందట. ఈ వ్యవహారాన్ని ఇంకా రచ్చ చేయడం ఇష్టంలేని దర్శకుడు.. కొంతకాలం కామ్ అయిపోయాడు. ఇంటికీ వెళ్తూ వస్తూ ఉండేవాడు. అయితే.. మళ్లీ... ప్రియురాలితో ఎటాచ్‌మెంట్ ఎక్కువైంది. ఆమెతో ఓ సినిమా కూడా చేశాడు. సెట్లో ఇద్దరి రాసలీలలూ.. ఇల్లాలికి తెలిసిపోయాయి. ఇంటికి రావడం మానేసిన ఆ భర్తని నిలదీద్దామని సరాసరి ఆ హోటెల్‌కే వెళ్లిందట. సరిగ్గా ఆ సమయానికి అక్కడ కథానాయిక కూడా ఉందట. దాంతో.. ఇద్దరి మధ్య గొడవ మొదలైనట్టు తెలుస్తోంది. ఆ కథానాయికని... చెడామడా తిట్టి, చెంప దెబ్బలు కొట్టి.. అక్కడ రణరంగం సృష్టించిందట దర్శకుడి భార్య. ఈ గొడవకు సంబంధించిన ఫుటేజీ ఆ హోటెల్ యాజమాన్యం దగ్గరే ఉందట. అది బయటకు వస్తే.. ఆ దర్శకుడు, కథానాయిక కొంప కొల్లేరవ్వడం ఖాయం. అన్నట్టు ఆ కథానాయిక ఈమధ్యే `నేను పెళ్లికి రెడీ.. మాది లవ్ మ్యారేజ్` అంటూ మనసులోని మాట బయటపెట్టింది. ఆ పెళ్లి.. ఆల్రెడీ పెళ్లయినవాడితో కాదు కదా.. అన్న గుసగుసలూ వినిపిస్తున్నాయ్. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏ తీరాన్న చేరుతుందో చూడాలి.