నన్ను చంపేస్తారు...రక్షించండి-సినీనటి అపూర్వ
on May 24, 2016
తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న నటి అపూర్వ తనకు ప్రాణహాని ఉందని రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్థార్థనగర్‌లో నివాసముంటున్న అపూర్వ ఈ నెల 21న చౌటుప్పల్ నుంచి వస్తున్నారు. ఆ సమయంలో ఆమె కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అపూర్వ కారు పూర్తిగా దెబ్బతింది. దీంతో మరమ్మత్తులు చేయించడానికి ఢీకొట్టిన వారు అంగీకరించారు. అంతేకాకుండా కారు రిపేరు పూర్తయ్యే వరకు వారి కారును కూడా అపూర్వ వద్దే ఉంచారు. ఈ నేపథ్యంలో యాక్సిడెంట్‌పై బెదిరిస్తూ కాల్స్ వస్తున్నాయని..రాత్రిళ్లు తన ఇంటి వద్ద అపరిచితులు తచ్చాడుతున్నారని ఆమె ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.