ఇవే ఈరోజు రిలీజ్ సినిమాలు..!
on May 27, 2016
ప్రతీ శుక్రవారం లాగే ఈ వారం కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కు లైనప్ అయ్యాయి. అయితే పెద్ద సినిమా ఒక్కటీ లేకపోవడం సినీప్రియులకు లోటే. కేవలం విశాల్ హీరోగా వచ్చిన రాయుడు మాత్రమే అన్నింటిలోనూ కాస్త తెలిసిన పేరు. వచ్చే వారం అ ఆ రిలీజయ్యే వరకూ చిన్న సినిమాలదే హవా. మరి ఈ రోజు ఏమేం రిలీజ్ అవుతున్నాయంటే..
విశాల్, శ్రీదివ్య జంటగా తెరకెక్కిన తమిళ సినిమా మరుదు. దీన్ని తెలుగులో రాయుడుగా డబ్ చేశారు. అక్కడ ఓ మాదిరి హిట్ సొంతం చేసుకున్నా, తెలుగులో మాత్రం రొటీన్ కథ అని తేల్చేస్తున్నారు రివ్యూయర్లు. ఒక పల్లెటూళ్లూ జరిగే కథగా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ముత్తయ్య. ఇక రెండోది, బ్రహ్మాజీ సత్యం రాజేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వసుధైక 1957. కొత్త దర్శకుడు బాల తెరకెక్కించిన ఈ సినిమా హర్రర్ కామెడీ గా రూపొందింది. సంపూర్ణేష్ బాబు, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ వినోదం 100%. పూర్తి కామెడీ అందిస్తామంటూ వస్తున్న ఈ సినిమా కూడా ఈరోజే రిలీజ్. సత్యం రాజేష్, పృథ్వీ, షకలక శంకర్ లు కీలక పాత్రలు పోషించారు.
విశాల్ రాయుడు రివ్యూ ఇక్కడ చూడండి.