మర్డర్ కేస్‌లో చిక్కుకున్న టబు
on Oct 27, 2014
ఢిల్లీలో డాక్టర్ల కుటుంబం. తల్లీదండ్రీ ఇద్దరూ వైద్యులే. కుమార్తె కూడా అదే దారిలో డాక్టర్ అవుదామనుకొంది. కానీ హఠాత్తుగా ఆమెను ఎవరో హత్య చేశారు. పోలీసులకు ఆ ఇంటి పనిమనిషిపై అనుమానం వచ్చింది. తెల్లారే సరికి ఆ పని మనిషీ హత్యకు గురయ్యాడు. పోలీసులకు చిక్కిన ఒకే ఒక్క క్లూ.. మాయమైనట్టైంది. మరో క్లూ అన్వేషించడానికి ఏడాది పట్టింది. పోలీసుల గురి మరొకరిపై పడేసరికి.. అతన్నీ ఎవరో చంపేశారు. దాంతో పోలీస్ డిపార్ట్‌మెంట్ మొత్తం షాక్ తింది. ఒక్క క్లూ కూడా దొరక్కుండా హత్యలు చేసిందెవరో తేల్చుకోవడానికి వాళ్లకు సంవత్సరాలు పట్టింది. చివరికి ఈ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు ? పదేళ్లయినా పోలీసులకు ఈ కేసు అంతు చిక్కలేదు. ఇది కథ కాదు. నిజం. ఢిల్లీలో సంచలంన సృష్టించిన ఆర్సీ తల్వార్ కేసు ఉదంతం ఇది. ఇప్పుడు ఈ మిస్టరీని మర్డర్స్‌ని సినిమాగా తీస్తున్నారు. టబు ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. విశాల్ భరద్వాజ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇలాంటి మర్డర్ మిస్టరీ చిత్రాల్లో నటించడం ఇదే తొలిసారని టబు చెబుతోంది. పోలీలకు అంతు తేలి తలనొప్పిగా మారిన ఈ కేసు... ప్రేక్షకులకు ఇంకెంత థ్రిల్లింగ్ కలిగిస్తుందో మరి.