'శ్రీమంతుడు' బజ్ అదిరింది..మరి సినిమా!!
on Aug 6, 2015
సూపర్ స్టార్ శ్రీమంతుడు సినిమా రిలీజ్ ఇంకా ఇరవై నాలుగు గంటలే వుంది. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ మొత్తం పాజిటివ్ బజ్ నడుస్తుండడం విశేషం. బాహుబలి లాంటి సినిమాకి కూడా రిలీజ్ ముందు నెగిటివ్ టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. సాధారణంగా టాలీవుడ్ లో సినిమాలపై ఒకరు హిట్ అంటే మరొకరు ఫ్లాప్ అనడం ఎక్కువగా చూస్తుంటాం.కానీ శ్రీమంతుడు విషయంలో అంతటా పాజిటివ్ బజ్ వినిపిస్తోంది.
సెన్సార్ దగ్గర నుంచి పాజిటివ్ టాక్ రప్పించుకున్న శ్రీమంతుడు..రెండు గంటల నలభై మూడు నిమిషాల పాటు అభిమానులను అలరించబోతున్నాడట. ఈ సినిమాకి వచ్చిన క్రేజ్,హైప్, ఇతరత్రా వ్యవహారాలను దృష్టిలో వుంచుకుని, 80 కోట్లకు అటు ఇటుగా ఈ సినిమా హక్కులు ఈరోస్ సంస్థ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందంతా శ్రీమంతుడి బిజినెస్ మ్యాజిక్. ఈ బజ్ ఏ మేరకు వాస్తవమో కొద్ది గంటల్లో జనాలే చెబుతారు.