ఐశ్వర్యా రాయ్‌తో కంపారిజన్.. స్నేహ యాంగ్రీ రియాక్షన్!
on Sep 26, 2020
టాలీవుడ్లో 'ఉల్లాసంగా ఉత్సాహంగా' వంటి హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించిన స్నేహా ఉల్లాల్ గుర్తుంది కదా. ఐశ్వర్యా రాయ్‌తో తెగతెంపులయ్యాక లక్కీ సినిమాతో ఆమెను హీరోయిన్గా పరిచయం చేశాడు సల్మాన్ ఖాన్. దాంతో ఐశ్వర్య మీద కోపంతోటే ఆమెలా ఉన్న స్నేహను సల్మాన్ ఇండస్ట్రీకి తీసుకొచ్చాడనే కామెంట్స్ అప్పట్లో బాగా వినిపించాయి. ఆ తర్వాత ఇంటర్వ్యూలలో స్నేహ సైతం ఐశ్వర్యతో పోలిక గురించి ఏమంటారు? అనే ప్రశ్నను ఎదుర్కొంది. ఒకసారి అలాంటి ప్రశ్నే ఎదురవడంతో స్నేహ కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యింది. ఐశ్వర్యతో పోలికకు తాను ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వనని ఆమె తేల్చి చెప్పేసింది. ఆ సందర్భంలో ఆమెలో ఆవేశం దాచాలన్నా దాగలేదు.
"మొదట్నుంచీ నేనిలాగే ఉంటాను. ఐశ్వర్యా రాయ్ ఇంటర్నేషనల్ సూపర్ స్టార్. నాకెలాంటి బ్యాగ్రౌండూ లేదు. ముంబైలో స్కూల్ చదివి అయిపోయాక, కాలేజీలో చేరి, అట్నుంచి అటే సినిమాల్లోకి వచ్చాను. అప్పట్నుంచీ నన్ను ఐశ్వర్యతో కంపేర్ చేస్తూ రావడం నాపై ప్రెషర్ పెంచింది. "నువ్వు చూడ్డానికి ఐశ్వర్యలా ఉన్నావ్ కాబట్టే ఆమెతో నిన్ను కంపేర్ చేస్తున్నారు. దాని కోసం నువ్వు స్ట్రెస్ ఫీలవనవసరం లేదు. అందంగా ఉండే మరొకరిలా నువ్వు ఉన్నావంటే, నువ్వూ అందంగా ఉన్నట్లే కదా. దాన్ని యాక్సెప్ట్ చెయ్యి." అని సల్మాన్ చెప్పారు. నిజాయితీ చెప్పాలంటే అందం గురించి నేనెక్కువగా ఆలోచించను. అసరమైతే తప్ప మేకప్ వేసుకోను. నేను అందంగా ఉండే మరొకరిలా ఉన్నానని అంటే దాన్ని నేనేమీ పట్టించుకోను. స్కూలు, కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా 'ఆమె చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది', 'ఆమె ఐశ్వర్యలా ఉంటుంది' అనే కామెంట్స్ విన్నాను. అయితే నేనెప్పుడూ అందంపై శ్రద్ధ పెట్టలేదు. నాకు టామ్‌బాయ్‌లా ఉండటం ఇష్టం. లూజ్ జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరిగేదాన్ని. కాబట్టి ఐశ్వర్యలా కనిపిస్తాననే దానికి నేను ప్రాధాన్యం ఇవ్వను" అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది స్నేహ.
Also Read