శివగామి రమ్యకృష్ణ కాదు... మధుబాల...
on Jun 14, 2017
బాహుబలి మొత్తంలో అత్యంత శక్తివంతమైన పాత్ర ఏదంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శివగామి. రమ్యకృష్ణ తన అభినయంతో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకులని అలరించింది. శ్రీదేవిని మొదట అనుకున్నారట అని వార్తలు వచ్చిన తర్వాత.. రమ్యకృష్ణ తప్ప ఆ పాత్రని ఎవరూ అంత సమర్ధవంతంగా చేయలేరని అందరు అభిప్రాయపడ్డారు. అంత గొప్పగా చేసింది రమ్యకృష్ణ. అయితే, ఇప్పుడు బాహుబలిని టీవీ సీరియల్ గా హిందీలో ఆరంబ్ అనే పేరుతో చేస్తున్న విషయం విదితమే. బాహుబలికి రచయితగా వ్యవహరించిన విజయేంద్ర ప్రసాద్ ఈ సీరియల్ కి కూడా కథ అందించడం విశేషం. కార్తీక దేవసేన పాత్ర చేస్తుండగా, నిన్నటి తరం నటి మధుబాలని శివగామి పాత్రకి తీసుకున్నారని సమాచారం. తాను హీరోయిన్ గా చేసిన రోజుల్లో దాదాపు సాఫ్ట్ రోల్సే చేసిన మధుబాల మొదటిసారి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తుంది. ఇంకో వెటరన్ హీరోయిన్ సోనాలి బింద్రే తన భర్త గోల్డీ బెహల్ తో కలిసి ఈ టీవీ సీరియల్ నిర్మిస్తుంది. వీళ్లిద్దరు సన్నిహితులవడం మధుబాలకి కలిసొచ్చింది. రమ్యకృష్ణ తనకి అత్యంత ఆప్తురాలని... ఆమె పోషించిన పాత్ర సీరియల్ లో తాను చేయడం ఆనందంగా ఉందని. సోనాలి బింద్రే తనకి స్నేహితురాలవడం వల్ల తనకి శివగామి లాంటి శక్తివంతమైన పాత్ర చేసే అదృష్టం వరించిందని చెప్పింది మధుబాల. తెలుగులో నిఖిల్ నటించిన సూర్య vs సూర్యలో చివరిసారిగా కనిపించిన మధుబాల, ఆరంబ్ తో టీవీ రంగంలోకి ఎంట్రీ ఇస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
