శ్రీదేవి బాటలో నాగకన్యగా శ్రద్ధ!
on Oct 28, 2020
'సాహో' హీరోయిన్ శ్రద్ధా కపూర్ శ్రీదేవి బాటలో నడుస్తోంది. శ్రీదేవికి బాలీవుడ్లో ఎంతో పేరు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఆమె నాగకన్యగా నటించిన 'నగీనా', 'నిగాహెన్' సినిమాలు కూడా ఉంటాయి. ఇప్పుడు శ్రద్ధ కూడా నాగకన్య పాత్రను పోషించేందుకు సిద్ధమవుతోంది. ట్రైలజీగా ఈ సినిమా రానున్నది. ఈ విషయాన్ని శ్రద్ధ స్వయంగా ఓ స్టేట్మెంట్ ద్వారా ధ్రువీకరించింది.
"నాగకన్య (నాగిన్)గా తెరపై నటించనుండటం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. శ్రీదేవి మేడమ్ నటించిన 'నగీనా', 'నిగాహెన్' సినిమాలు చూస్తూ, వాటిని ఇష్టపడుతూ పెరిగాను. భారతీయ సంప్రదాయ జానపద కథల్లో ఒకటైన అలాంటి పాత్రను చేయాలని ఎప్పుడూ కోరుకునేదాన్ని. ఇది.. ప్రేక్షకుల్ని ఎప్పుడూ అలరించే ఒక ఐకనిక్ క్యారెక్టర్‌ను పోషించడమే" అని చెప్పింది శ్రద్ధ. విశాల్ ఫురియా డైరెక్ట్ చేఏసే 'నాగిన్' మూవీని సఫ్రాన్ బ్రాడ్కాస్ట్ అండి మీడియా లిమిటెడ్ బ్యానర్‌పై నిఖిల్ ద్వివేది నిర్మించనున్నాడు.
గతంలో నాగిన్ క్యారెక్టర్‌ను వైజయంతీమాల, రీనా రాయ్, రేఖ, శ్రీదేవి వంటివాళ్లు పోషించారు. అయితే 'నగీనా', 'నిగాహెన్' సినిమాల్లో శ్రీదేవి చేశాకే ఆ క్యారెక్టర్‌కు కల్ట్ స్టేటస్ వచ్చింది.
Also Read