బికినీలో సమంత... సో హాట్ గురూ!
on Nov 25, 2020
సమంత సినిమా కెరీర్ స్టార్టింగులో ఒక తమిళ సినిమాలో బికినీ వేసుకున్నారు. తెలుగులో 'ఏ మాయ చేసావే' సినిమాతో సక్సెస్ అందుకున్న తర్వాత కొన్ని సినిమాలలో పాత్రల పరంగా గ్లామర్ డోస్ పెంచినప్పటికీ... సిల్వర్ స్క్రీన్ మీద బికినీ షో చేసింది తక్కువే. సూర్యతో నటించిన ఓ సినిమాలో బికినీ వేసుకున్నారు. మళ్లీ ఓ మ్యాగజైన్ ఫోటో షూట్ కోసం బికినీ ధరించి ఫోజులు ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి బికినీతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
భర్త నాగ చైతన్యతో కలిసి సమంత మాల్దీవుల వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ బాత్ టబ్ లో బికినీ వేసుకున్న ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టోరీలో సమంత షేర్ చేశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బికినీలో సమంత సో హాట్ గురు అంటున్నారు నెటిజన్లు.
గతంలో ఓసారి భర్తతో కలిసి విహార యాత్రకు వెళ్ళినప్పుడూ బికినీ లో దిగిన ఫోటోలను సమంత షేర్ చేశారు. పెళ్లయిన తర్వాత ఇటువంటి ఫోటోలు ఏమిటి అని ఆమెపై కొందరు కామెంట్ చేశారు. అందుకు సమంత ఘాటుగానే బదులిచ్చారు. ఈసారి ఎటువంటి విమర్శలు వస్తాయో? ఆమె ఏమంటారో? చూడాలి.