సుప్రీం హీరో రికార్డ్ టచ్ చేసేశాడు..!
on May 23, 2016
మెగా హీరో సుప్రీం సాయి ధరమ్ కెరీర్ రేయ్ లాంటి సినిమాతో కాస్త డల్ గా స్టార్ట్ అయినా, ఇప్పుడు మంచి స్పీడందుకుంటోంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో ఫర్లేదనిపించిన మెగా మేనల్లుడు, సుప్రీంతో తన కెరీర్ రికార్డ్ మార్క్ ను టచ్ చేసేశాడు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతిలో పడటం కూడా మేనల్లుడు గారికి కలిసొచ్చింది. సాయితో వరస సినిమాలు తీయడమే కాక, మంచి కథలు సెలక్ట్ చేస్తూ మెగా హీరో కెరీర్ ను మెట్లెక్కిస్తున్నాడు దిల్ రాజు. తాజాగా వచ్చిన సుప్రీం తో, తను కూడా కాస్త ఒడ్డున పడ్డాడు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సుప్రీం వరల్డ్ వైడ్ షేర్ ఇప్పుడు 20 కోట్లు దాటింది. ఇది తేజూ కెరీర్లోనే బెస్ట్ మార్క్ కావడం విశేషం. మామూలుగా అయితే ఈ 20 కోట్ల మార్క్ కు పెద్ద ఇంపార్టెన్స్ ఉండకపోయేదేమో కానీ, సూర్య 24, బ్రహ్మోత్సవం, సరైనోడు లాంటి స్ట్రాంగ్ సినిమాల పోటీని తట్టుకుని నిలబడటం చూస్తే, ఇప్పుడిప్పుడే పైకొస్తున్న హీరో సినిమాగా, సుప్రీం చాలా బాగా ఆడినట్టే. కామెడీ, అనిల్ టేకింగ్, రాశి ఖన్నా గ్లామర్ అన్నీ కలిసి సినిమాను కంప్లీట్ హిట్ గా నిలబెట్టాయి. సినిమా బి, సి సెంటర్లలో ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండటం విశేషం.