'సోలో బ్రతుకే సో బెటర్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే...
on Dec 1, 2020
సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న 'సోలో బ్రతుకే సో బెటర్' (ఎస్‌బిఎస్‌బి) మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. సుబ్బు డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ మూవీలో నభా నటేశ్ హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ మూవీ థియేటర్, శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జీ స్టూడియోస్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
రూ. 38 కోట్లకు బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో జీ స్టూడియోస్ డీల్ కుదుర్చుకున్నట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. వీటిలో డిజిటల్ రైట్స్ వాటా రూ. 10 కోట్లు అంటున్నారు. థియేటర్లలో రిలీజైన మూడు వారాలకు ఈ సినిమా ఓటీటీలో వీక్షకుల ముందుకు రానుంది. అంటే.. జీ ప్లెక్స్, జీ5లో 'సోలో బ్రతుకే..' 2021 జనవరిలోనే ప్రత్యక్షం కానున్నది.
జీ5 అధికారికంగా ప్రకటించకపోయినా, విశ్వసనీయ సమాచారం ప్రకారం సంక్రాంతి సీజన్లో ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలవనుంది. ఆ తర్వాత జీ తెలుగులో టెలివిజన్ ప్రీమియర్ వస్తుంది. ఫిబ్రవరిలో 'సోలో బ్రతుకే సో బెటర్' టీవీలో ప్రసారమయ్యే అవకాశాలు ఎక్కువ.