33 సంవత్సరాల తర్వాత బాబాగా విజయచందర్
on Mar 15, 2016
సాయిబాబాగా షిర్దిసాయిమహత్య్వం చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొన్న విజయచందర్ దాదాపు 33 సంవత్సరాల తర్వాత మళ్లీ బాబాగా నటిస్తున్నారు. శ్రీమల్లాది వెంకటేశ్వర ఫిలింస్ సమర్పణల రూపొందుతున్న సాయేదైవం చిత్రంలో విజయచందర్ బాబాగా నటిస్తున్న సన్నివేశాల చిత్రీకరణ సోమవారం హైదరాబాద్ బాబా గుడిలో ప్రారంభమైంది. సాయిబాబా భక్తుల అనుభవాల నేపథ్యంల తీస్తున్న ఈ చిత్రంలో భక్తులకు దర్శనమిస్తూ, ఉపదేశం అందించే సన్నివేశాలను చిత్ర దర్శకుడు, నిర్మాత జి.యల్.బి. శ్రీనివాస్ చిత్రీకరించారు. విజయచందర్ బాబాగా నటించడానికి అంగీకరించడం తమ అదృష్టమని, బాబా భక్తులకు కూడా ఇది ఆనందం కలిగిస్తుందని దర్శకుడు చెప్పారు. ప్రస్తుతం పతాకసన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నాం. దీంతో సినిమా మోత్తం పూర్తవుతుంది. వచ్చే నెలల పాటలను విడుదల చేసి, మేల సినిమాను రిలీజ్ చేస్తామని ఆయన తెలిపారు