జక్కన్న బర్త్ డే స్పెషల్ గా ఆర్ ఆర్ ఆర్?
on Jan 23, 2021
డైరెక్టర్ నంబర్ వన్ ఎస్. ఎస్. రాజమౌళి ఇప్పటివరకు 11 సినిమాలను రూపొందించారు. అయితే, వీటిలో ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా జక్కన్న బర్త్ డ్ స్పెషల్ గా రిలీజ్ అయిన సందర్భం లేదు.
కాగా, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న బడా మల్టిస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్.. రాజమౌళి పుట్టినరోజుకి రెండు రోజుల ముందు రిలీజ్ కాబోతోందట. జక్కన్న బర్త్ డే అక్టోబర్ 10న కాగా.. రెండు రోజుల ముందు అంటే అక్టోబర్ 8న యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ పిరియడ్ డ్రామా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయనుందట. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నారు. అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
