ENGLISH | TELUGU  

అకిర‌, ఆద్య‌తో ప‌వ‌న్.. బ్యూటిఫుల్‌ పిక్చ‌ర్‌ను షేర్ చేసిన రేణు దేశాయ్‌!

on Dec 2, 2020

 

ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు పాలిటిక్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను షేర్ చేసుకోవ‌డానికి ఆయ‌న అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. అయితే ఏదో ర‌కంగా ఆయ‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు బ‌య‌ట‌కొస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని ఫ్యాన్స్‌కు సంబ‌రాన్ని క‌లిగిస్తే, కొన్ని ఇబ్బందినీ క‌లిగిస్తుంటాయి.

విడిపోయి చాలా కాల‌మైనా, అప్పుడ‌ప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పిక్చ‌ర్స్‌ను ఆయ‌న మాజీ భార్య రేణు దేశాయ్ షేర్ చేస్తూ వ‌స్తుంటారు. లేటెస్ట్‌గా త‌మ పిల్ల‌లు అకిర నంద‌న్‌, ఆద్య‌ల‌తో ప‌వ‌ర్‌స్టార్ స‌న్నిహితంగా ఉన్న ఓ బ్యూటిఫుల్‌ పిక్చ‌ర్‌ను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆమె షేర్ చేశారు. స‌హ‌జంగానే ఆ పిక్చ‌ర్ ఫ్యాన్స్‌తో పాటు అంద‌రినీ అల‌రిస్తోంది. ఆ బ్లాక్ అండ్ వైట్ పిక్చ‌ర్‌లో సోఫాలో ప‌వ‌న్ కూర్చొని ఉంటే, ఆయ‌న‌కు ఇరువైపులా అకిర‌, ఆద్య ఆయ‌న ఎద‌పై ప‌డుకొని నిద్ర‌పోతున్న‌ట్లుగా ప‌డుకొని ఉన్నారు. అకిర త‌ల‌ను ముద్దాడుతున్నారు ప‌వ‌న్‌. ఆ స‌న్నివేశాన్ని త‌న ఫోన్ కెమెరాతో బంధించారు రేణు.

దాంతో పాటు, “Certain beautiful photographs have to be shared, they can’t just stay in the photo album of your phone...Some rare moments captured by me on my phone camera.” (sic) అని రాసుకొచ్చారు రేణు. ఆ పిక్చ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. అది ఇటీవ‌లి కాలానికి సంబంధించిన‌దిగానే క‌నిపిస్తోంది. ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు రేణు వ‌చ్చారా, లేక రేణు ద‌గ్గ‌ర‌కు ప‌వ‌న్ వెళ్లారా.. అనేది తెలీదు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం 'వ‌కీల్ సాబ్' షూటింగ్‌ను కంప్లీట్ చేసే ప‌నిలో ఉన్నారు. ఆ వెంట‌నే క్రిష్ డైరెక్ష‌న్‌లో ఆయ‌న న‌టించ‌నున్నారు. మ‌రోవైపు 'ఆద్య' అనే వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నారు రేణు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.