రానా పెళ్లికీ - అనుష్క పెళ్లికీ లింకేంటి?
on Jun 2, 2015
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇద్దరూ బాహుబలిలోనే ఉన్నారు. రానా, ప్రభాస్ కి ఇంకా పెళ్లి కాలేదు. బాహుబలి తరవాత ప్రభాస్ పెళ్లి జరగడం ఖాయమైపోయింది. ఇక రానా వంతు. రానా వెండితెరపై యాక్షన్ యోధుడిలా కనిపిస్తాడు గానీ.. బయట మహా రొమాంటిక్. బిపాసాబసు, త్రిషలతో రానాకి ఎఫైర్లు ఉన్నాయని రూమర్లు నడిచాయి. ఇక బాహుబలి లో కథానాయికగా నటిస్తున్న అనుష్క పెళ్లిపైనా బోలెడన్ని రూమర్లు. మరి ప్రభాస్, రానా, అనుష్క ఈ ముగ్గురూ ఎప్పుడు పెళ్లి చేసుకొంటారు..?? బాహుబలి ట్రైలర్ విడుదల సందర్భంగా ప్రబాస్, రానా, అనుష్క, తమన్నాల మధ్య స్మాల్ చిట్ చాట్ జరిగింది. ఈ సందర్బంగా పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. 'మంచి ముహూర్తం కుదరనివ్వండి పెళ్లి చేసుకొంటా..' అని ప్రభాస్ సమాధానం చెబితే... అనుష్క మాత్రం వెరైటీగా 'రానాకి పెళ్లయ్యాకే నేను పెళ్లి చేసుకొంటా' అంది. దాంతో రానా కాస్త షాక్ అయ్యాడు. వెంటనే తేరుకొని 'నన్నెవరు పెళ్లి చేసుకొంటారండీ..' అంటూ కామెంట్ చేశాడు. మొత్తానికి పెళ్లి విషయమై రానా, అనుష్క, ప్రభాస్‌ల మనసులో ఏమనుకొంటున్నారో.. అర్థమైపోయింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
