రామ్.. సెంటిమెంట్ రిపీట్
on Jan 23, 2021
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి అచ్చొచ్చిన సీజన్.. సంక్రాంతి. ఈ సీజన్ లో తన మొదటి సినిమా దేవదాసు (2006) రిలీజైంది. తొలుత డివైడ్ టాక్ వచ్చినా.. క్రమంగా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఆ తరువాత ఇదే ముగ్గుల పండగ టైమ్ లో మస్కా (2009) విడుదలైంది. తొలుత సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. అరుంధతి ప్రభావంతో హిట్ స్థాయికే పరిమితమైంది. ఆ తరువాత సంక్రాంతి సీజన్ లో భాగంగానే జనవరి 1న నేను శైలజ (2016)తో పలకరిస్తే.. ఆ సినిమా కూడా మంచి హిట్ అయింది.
కట్ చేస్తే.. ఈ సంక్రాంతికి రెడ్ తో సందడి చేశాడు రామ్. తమిళ చిత్రం తాడమ్ ఆధారంగా రూపొందిన ఈ మాస్ థ్రిల్లర్ కి డివైడ్ టాక్ వచ్చినా.. ఫైనల్ గా లాభాల బాట పట్టింది. రామ్ కి ఉన్న సెంటిమెంట్ రిపీట్ అయి.. రెడ్ కూడా సక్సెస్ ఫుల్ వెంచర్ గా నిలిచింది. రెండు విభిన్న పాత్రల్లో రామ్ దర్శనమిచ్చిన ఈ సినిమాతో.. నటుడిగానూ మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి.. భవిష్యత్ లోనూ సంక్రాంతి సీజన్ లో రామ్ ఇదే విజయ పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి.