రామ్ చరణ్ సినిమాలో యంగ్ హీరో...!
on Jun 7, 2016
తమిళంలో సూపర్ హిట్టైన తనీ ఒరువన్ రీమేక్ లో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు మూడు సినిమాలుగా చెర్రీకి సరైన హిట్ పడలేదు. ఈ సారి ఎలాగైనా భారీ హిట్ ను ఎకౌంట్ లో వేసుకోవాలని తనీ ఒరువన్ ను ఎంచుకున్నాడు చరణ్. ఈ సినిమా స్టోరీ లైన్ తో పాటు, టేకింగ్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. తెలుగులో కూడా అదే స్థాయి సినిమాను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు చెర్రీ ఫ్యాన్స్.
సినిమాలో చరణ్ తో పాటు ట్రైనీ ఐపిఎస్ గా కనిపించే ఫ్రెండ్స్ లో ఒక పాత్రకు యంగ్ హీరో నవదీప్ ను తీసుకున్నారట. ఇప్పటికే ఆర్య2, ఓ మై ఫ్రెండ్, బాద్ షా సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు నవదీప్. ఇక తమిళ మాతృకలో విలన్ గా చేసిన అరవింద్ స్వామి, అదే పాత్రను రీమేక్ లో కూడా పోషిస్తున్నాడు. థ్రిల్లర్ యాక్షన్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా రిలీజ్ గా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం.