రామ్ చరణ్ 'బ్రూస్ లీ'యే
on Aug 28, 2015
రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ సస్పెన్స్ కి తెరదించాడు డైరెక్టర్ శ్రీనువైట్ల. చరణ్ శ్రీనువైట్ల సినిమా పేరు బ్రూస్ లీ మొదట్లో వార్తలు వచ్చిన వాటిని ఏవరు పట్టించుకాకపోవడంతో మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు సడన్ గా చరణ్ సినిమా పేరు బ్రూస్ లీ అంటూ ఫస్ట్ లుక్ ఫోటోలను, టైటిల్ లోగోను బయటకు వదిలింది చిత్ర యూనిట్. అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మాత్రం సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా బ్యాలెన్స్ వున్న వర్క్ ఈ నెల రోజుల్లో పూర్తవుతుందా లేదా అనేది అనుమానంగా వుంది. దసరాకి ఎట్టి పరిస్థితుల్లోను విడుదల చేయాలనే ప్రెజర్ వున్నప్పటికీ హడావిడిగా సినిమాని చుట్టి పారేయడానికి కూడా ఎవరూ ఇష్టపడడం లేదట. ఇప్పటి స్టేటస్‌ని బట్టి ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
