దుస్తులు లేకుండా.. రకుల్!
on Jun 5, 2020
రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ డెనిమ్ జాకెట్ బటన్స్ విప్పిసే... నాభి నుండి ఆపైన అందాలు చూపించీ చూపించకుండా కుర్రకారుకు కునుకు లేకుండా చేశారు. ఆ ఫొటో హాట్ టాపిక్. రెండు మూడు రోజులు ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పుడు బటన్స్ విప్పడం కాదు... అసలు బట్టలే వేసుకోలేదు. జస్ట్ ఓ బ్రోక్లీన్ (క్లాలీఫ్లవర్లా ఉండే ఓ వెజిటెబుల్) పీస్ అడ్డం పెట్టుకుని ఫొటో దిగారు. పబ్లిసిటీ కోసం కాదు, ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఈ స్పెషల్ ఫొటోషూట్.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసిన ఫొటో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మాంసాహారం మానేసి, జంతువులను సంరక్షించడంతో పాటు కాయగూరలు, ఆకుకూరలు తినమని ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ఫొటో ముఖ్యోద్దేశం. గతంలో రకుల్ నాన్ వెజ్ తినేవారు. కొన్ని నెలలుగా మానేశారు. వీగన్‌గా మారారు. మాంసాహార ఉత్పత్తులు ఏవీ తినడం లేదు. అందుకని, పెటా ఇండియా ఆమెను సంప్రదించి ఈ ఫొటోషూట్ చేశారు.