రకుల్.. మరీ ఇంత సాహసమా?
on May 18, 2015
గ్లామర్ డాల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ మన కథానాయికలు. అందాలు ఆరబోసే పాత్రలైతే.... క్యూ కట్టేస్తారు. అయితే అప్పుడప్పుడూ అవార్డుపై ఆశతో డీ గ్లామర్ పాత్రలు పోషిస్తుంటారు. అయితే ఇది ఒక రకంగా సామసమే. డీ గ్లామర్ రోల్ ఏమాత్రం గాడి తప్పినా కెరీర్‌కే ముప్పు. అటు అవార్డూ రాదు. ఇటు కెరీర్ కూడా ఉండదు. అయితే రకుల్ ఇప్పుడు అలాంటి సాహసమే చేయబోతోంది. ఓ సినిమా కోసం అంగవైగల్యం ఉన్న అమ్మాయిగా కనిపించబోతోంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘బెంగుళూరు డేస్’. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్‌కు ఓ పాత్ర దక్కిందట. మలయాళంలో పార్వతీ నాయర్ చేసిన పాత్రలో రకుల్ కనిపించబోతోంది. పార్వతి పాత్ర స్పెషల్ ఏంటంటే.. అందులో ఆమె ఫిజికల్లీ హ్యాండీ కాప్ట్‌గా కనిపించింది. ఇప్పుడు ఆ సాహసం రకుల్ చేస్తోందన్నమాట. పండగ చేస్కో, కిక్ 2, చరణ్, ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉంది రకుల్. మరి ఈ చిత్రానికి కాల్షీట్లు ఎలా కేటాయిస్తుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
