రాజశేఖర్ కుమార్తెకు బంపర్ ఆఫర్?
on Jul 27, 2017
రాజశేఖర్ ఎంత మంచి నటుడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. జీవిత ఏమన్నా తక్కవ తిన్నదా? ఆమె కూడా మంచి నటి. మరి వీరిద్దరికీ పుట్టిన పిల్లలకి వారి కళలు అబ్బకుండా ఉంటాయా?
రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానిని చూడండి!... నటన, నాట్యం, మార్షల్ ఆర్ట్స్... తదితర అంశాల్లో శిక్షణ తీసుకుంటూనే...మరోవైపు శ్రద్ధగా మెడిసన్ చేస్తోంది. అంతేనా...! కంటెంట్, బ్రాండింగ్, ఫిలిం యాక్విజిషన్, ఇంటిగ్రేషన్, స్పోర్ట్ష్, మ్యూజిక్ తదితర రంగాల నేపథ్యంతో సాగే ఇండియాలోని అతిపెద్ద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ‘క్వాన్’తో టై అప్ అయ్యింది. ప్రస్తుతం చాలామంది నిర్మాతలు, దర్శకులు ఇప్పుడు శివాని గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి ఇటీవల ఆమె చేసిన ఫొటోషూట్ కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. ఫస్ట్ లుక్ తోనే చాలామంది నిర్మాతల కళ్లలో పడిందీ రాజశేఖర్ ముద్దుల తనయ. ఆమెను తమ సినిమాల్లో కథానాయికగా నటింపజేయడానికి పలువురు నిర్మాతలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే... ఫస్ట్ కచ్ఛీఫ్ మాత్రం నిర్మాత రాజ్ కందుకూరి వేసేశాడని సమాచారం. గత ఏడాది ‘పెళ్లిచూపులు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ నిర్మాత... త్వరలో తన కుమారుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేయనున్నాడు. అతనికి జోడీగా శివాని అయితే బావుంటుదని భావించిన రాజ్.. ఇటీవల రాజశేఖర్ దంపతులను కలిసినట్టు సమాచారం. వారు కూడా పాజిటివ్ గా స్పందించారని వినికిడి. ప్రస్తుతం శివ కందుకూరి అమెరికా పెన్సిల్వేనియాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఈ ఏడాదితో అతని చదువు కూడా పూర్తి కానుంది. సో... 2018లో ఈ చిత్రం పట్టాలెక్కనున్నదన్నమాట. గాడ్ బ్లెస్ యూ శివానీ...
Also Read