బాహుబలి గుట్టు విప్పిన రాజమౌళి
on Jun 3, 2015
తన ప్రతి సినిమా ప్రారంభంలో... కథనిచూచాయిగా పరిచయం చేయడం రాజమౌళికి అలవాటు. మగధీర, మర్యాద రామన్న, ఈగ కథల్ని ముందే చెప్పేశాడు రాజమౌళి. అయితే బాహుబలి కథ విషయంలో ఇంత వరకూ గుట్టు విప్పలేదు. సినిమా మొదలై రెండేళ్లయినా..బాహుబలి కథ ఇదంటూ ఎప్పుడూ చెప్పలేదు. చివరికి ఆ సీక్రెట్ కూడా చెప్పేశాడు రాజమౌళి. మహాభారత గాథ ఆధారంగా బాహుబలి తెరకెక్కించారని చాలా రోజుల నుంచి బయట ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రాజమౌళి కూడా ఆ మాటే చెప్పాడు. ఇది మహాభారతం స్ఫూర్తితో తెరకెక్కించిన కథ అని... క్లారిటీ ఇచ్చాడు. బాహుబలి రెండు భాగాలే కాదు, తాను ఇప్పటి వరకూ తీసిన ప్రతీ సినిమాలోనూ రామాయణ, మహాభారత గాథల స్ఫూర్తి ఉంటుందన్నాడు రాజమౌళి. ఈ సినిమాలోని ప్రధాన పాత్రధారుల్ని ఇప్పటికే పరిచయం చేశాడు రాజమౌళి. త్వరలోనే ఆపాత్రల్ని డిటైల్డ్‌గా వివరిస్తూ మరో ట్రైలర్ ఉండబోతోందని తెలుస్తోంది. జులై 10న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈలోగా బాహుబలి గురించి మరింత విస్ర్కృతమైన సమాచారం అందించేందుకు రాజమౌళి అండ్ టీమ్ సమాయాత్తమవుతోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
