రాజా ది గ్రేట్ ఫస్టాఫ్ రివ్యూ
on Oct 18, 2017
మాస్ మహారాజ్ రవితేజను ప్రేక్షకులు ధియేటర్లలో చూసుకొని దాదాపు రెండేళ్లు దాటిపోయింది. ఆయనకు ఆరోగ్యం సరిలేదని.. మంచి కథలు రావడం లేదని.. నిర్మాతలతో బేరం సరిగా కుదరడం లేదంటూ రకరకాల ఊహాగానాలు.. కారణం ఏదైనా రవి రెండేళ్లు కాలం గడిపేశాడు. మరి ఇన్ని రోజుల తర్వాత మాస్ మహారాజ్ సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పక్కర్లేదు. దానికి తోడు సినిమా మొత్తం అంధుడిగా నటించడంతో.. మూవీపై క్యూరియాసిటీ అంతకంతకూ పెరిగిపోయింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ నటించిన రాజా ది గ్రేట్ ఇవాళ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పూర్తయి టాక్ బయటకు వస్తోంది. దీంతో సినిమాపై తమ అభిప్రాయాలను సన్నిహితులతో పంచుకుంటున్నారు అభిమానులు. రవితేజ పుట్టుకతోనే అంధుడు.. అయితే తన కుమారుడిని పోలీస్‌గా చూడాలనుకుంటుంది తల్లి. కానీ గుడ్డివాడు కావడంతో పోలీస్ ఉద్యోగానికి అనర్హుడిగా మారతాడు. ఈ క్రమంలో హీరోయిన్ పరిచయం కావడం.. ఆమెకు ఉన్న సమస్యను రవితేజ ఎలా పరిష్కరించాడన్నదే కథ. ఫస్టాఫ్‌లో తల్లిగా రాధిక పర్ఫామెన్స్ అదిరిపోయిందట. అంధుడిగా రవితేజ పడిన కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుందట. ఆయన కెరీర్‌లోనే మైల్‌స్టోన్ మూవీగా ఈ సినిమా మిగిలిపోతుందని ప్రేక్షకులు అంటున్నారు. పూర్తి రివ్యూ కోసం తెలుగువన్‌ని ఫాలో అవ్వండి.