బాలయ్య బ్యూటీ గళం విప్పుతుందట!
on Jun 25, 2015
సినిమాలతో కన్నా హాట్ హాట్ ఫొటోషూట్స్ తోనే పాపులారిటీ సంపాదించుకున్న భామ రాధికా ఆప్టే. రక్తచరిత్రలో ఈ పిల్లని చూసి అబ్బా భలే పద్ధతిగా ఉందే అనుకున్నారు. ధోని, లెజెండ్ లో చూసి సంప్రదాయబద్ధంగా ఉంది సీనియర్ హీరోల పక్కన సరిపోతుందిలే అనుకున్నారు. కానీ ఇంతలోనే రాధిక విశ్వరూపం చూపించింది. న్యూడ్ గా ఫొటోలు విడుదల చేసి ఓసారి, సెక్స్ అమ్ముకోదగిన సబ్జెక్ట్ అని మరోసారి హడావుడి చేసింది. దీంతో ఆమెను కదపాలంటే వామ్మో అంటున్నారంతా. ఇన్ని కళలున్న ఆప్టే మరో కొత్త కళ ప్రదర్శిస్తానంటోందట.
ఇంకేం కళ తల్లీ అంటే...చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే చాలా ఇష్టం. మా కుటుంబం కూడా సంగీతనేపథ్యం ఉన్నదే. అప్పట్లో నేర్చుకున్నా....ఇండస్ట్రీలోకి వచ్చికా వదిలేశా. మళ్లీ ఎందుకో ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తోందని సెలవిచ్చిందట. ఇంటికి శిక్షకుడిని పిలిపించి మరీ నేర్చుకుంటోందట. మొత్తానికి నెక్ట్స్ మూవీలో రాధిక గళం విప్పనుందన్నమాట. మరి రకరకాలుగా సంచలనాలు సృష్టిస్తోన్న రాధిక సింగర్ గా ఆకట్టుకుంటుందేమో చూద్దాం.