పూరీకి ఓకే చెప్పిన మహేష్..!
on Sep 24, 2014
మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి' అప్పట్లో ఎన్ని రికార్డులు సృష్టించిందో తెలిసిందే. ఆతరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మ్యాన్ కూడా మంచి హిట్టైంది. ఇప్పుడు వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి కలిసి పని చేయబోతున్నారట. ఇటీవల ఓ సందర్బంలో మహేష్ ని కలిసిన పూరి జగన్నాథ్ ఓ స్క్రిప్టు వినిపించాడట. దీనికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ సినిమాకి రెడీ అవుతుండగా, పూరి జగన్నాధ్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయిన తరువాత వీరి సినిమా ప్రారంభం అవుతుందట.