"గార్జియస్.. స్వీటెస్ట్" హీరోయిన్‌కు పూరి అండ్ చార్మి బర్త్‌డే విషెస్!
on Oct 30, 2020
టాలీవుడ్‌కు 'ఫైటర్' సినిమా ద్వారా పరిచయం కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే బర్త్‌డే ఈ రోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానుల నుంచి సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ఫైటర్'లో విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ చేస్తుండగా, అతని జోడీగా అనన్య నటిస్తోంది.
తన హీరోయిన్ బర్త్‌డేను పురస్కరించుకొని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆమెకు విషెస్ తెలియజేశాడు పూరి. ఆమె సోలో ఫొటోను షేర్ చేసి, "హ్యాపీ బర్త్‌డే గార్జియస్ అనన్యా".. అంటూ సంబోధించిన ఆయన, "నీ హార్డ్ వర్క్, డెడికేషన్ నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తాయి. మన షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేయడం కోసం ఎదురుచూస్తున్నా. lots of love always." అని ట్వీట్ చేశాడు.
ఆయనతో పాటు ఫైటర్ నిర్మాత చార్మీ కౌర్ కూడా అనన్యను విష్ చేసింది. అనన్యను కావలించుకొని ఉన్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన చార్మి, "Happiest birthday my sweetest @ananyapanday .. U hv the most amazing vibe with the most amazing zeal towards whatever u do ., keep shining always." అని రాసుకొచ్చింది.
Also Read