హీరోయిన్ తో ప్రభాస్ పెళ్లి??
on Oct 28, 2015
టాలీవుడ్ కి ఇది షాకింగ్ న్యూసే. మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్.. ప్రభాస్ పెళ్లి కుదిరిందని, త్వరలోనే ఓ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడన్న గుసగుసలు టాలీవుడ్ అంతటా వ్యాపించాయి. ప్రభాస్ వచ్చే యేడాది పెళ్లి చేసుకోబోతున్నాడన్నది ఓ న్యూస్. బాహుబలి 2 షూటింగ్ పూర్తయిన వెంటనే, ప్రభాస్ పెళ్లి చేసుకొంటాడని ఆయన సన్నిహిత వర్గాలే చెబుతున్నాయి.
అయితే.. అది ప్రేమ పెళ్లి కావొచ్చన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని, ఓ కథానాయికతో కొన్నాళ్లుగా సన్నిహితంగా మెలుగుతున్నాడని, వాళ్లిద్దరూ ఇంట్లోవాళ్లని ఒప్పించి, త్వరలోనే ఒక్కటవ్వబోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్ని మాత్రం ప్రభాస్ సన్నిహితులు ఖండించడం లేదు. అలాగని `అవును` అని కూడా చెప్పడం లేదు.
ప్రభాస్ అయితే పెళ్లి మాట ఎత్తగానే.. సిగ్గుపడుతూ చిరునవ్వుల మాటున సమాధానాన్ని దాట వేస్తున్నాడు. మరి ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? ఎవరితో?? అనేవాటికి సమాధానాలెవరు చెబుతారో? మొత్తానికి 2016లో ప్రభాస్ పెళ్లన్నది ఖాయమైపోయింది. ఎవరితో అన్నది మాత్రం కాలమే చెప్పాలి.