పవన్‌ను దువ్వుతున్న గిరిబాబు..?
on Aug 4, 2017
విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది మందిలో గిరిబాబు ఒకరు. తాజాగా ఆయన ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ పవన్‌కళ్యాణ్‌ను ఆకాశానికెత్తేశాడు. పవన్ పెద్దల పట్ల ఎంతో వినయ విధేయతలతో ఉండే వ్యక్తి అని..మంచి నటుడు మాత్రమే కాకుండా పక్కా జెంటిల్మెన్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇప్పటి వరకు ఆయనతో పనిచేసే అవకాశం రాలేదని కాస్త ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పవన్ మద్దతు వల్లనే టీడీపీ గెలిచిందని..ఆయన రాజకీయాలలో రాణించడం ఖాయమన్నారు. సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోను కానీ..డైరెక్టర్‌ను కానీ వేరే వాళ్లు పొగిడారు అంటే ఏదో ప్రయోజనం ఆశించే అనేది ఓపెన్ సిక్రెట్. అలా పొగిడి నెక్ట్స్ మూవీలోనో లేదా ఇంకేదో లాభం పొందాలనేది వారి ప్లాన్. మరి గిరిబాబు లాంటి సీనియర్ పవన్‌ను ప్రశంసించడం వెనుక ఆంతర్యం ఏంటో త్వరలోనే తెలుస్తుందంటున్నారు ఫిలింనగర్ జనాలు.