పవన్ అంటే మరీ అంత ప్రేమా?
on Jul 8, 2017
నేటి హీరోలు కూడా నిన్నటి ఫ్యాన్సే కదా. ఈ విషయా్న్ని గతంలో చాలామంది హీరోలు నిజం చేశారు. వాళ్లు హీరోలు అయ్యాక కూడా అభిమాన హీరోపై అభిమానం వదులుకోలేదు. అలాంటి వాళ్లలో కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్, చిరంజీవి ముందుంటారు. వీరుముగ్గురూ సినిమాల్లోకి రాకపూర్వం ఎన్టీయార్ ఫ్యాన్స్. నటులయ్యాక కూడా ఆ అభిమానం వదల్లేదు. సూపర్ స్టార్ కృష్ణ .... తన అభిమాన హీరో ఎన్టీయార్ తో ఓ సినిమానే నిర్మించి, తన చిరకాల కోరిక తీర్చుకున్నారు. ఇక శోభన్ బాబు అయితే... కళ్లు తెరవగానే ఎన్టీయారే కనిపించాలని ఏకంగా తన బెడ్ రూమ్ లోనే ఎన్టీయార్ కృష్ణుని రూపాన్ని పెట్టుకున్నారు.
చిరంజీవి అయితే.. పలు ఇంటర్వ్యూల్లో... స్కూల్ కి బంక్ కొట్టి మరీ ఎన్టీయార్ సినిమాలకెళ్లిన రోజులు గుర్తు చేసుకున్నారు. తాను అక్కినేని నాగేశ్వరరావు అభిమానినని కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు కూడా. అయితే... మహానటుడు ఎన్టీయార్ తర్వాత ఎక్కువమంది హీరోలను అభిమానులుగా మార్చుకున్న క్రెడిట్ మెగాస్టార్ చిరంజీవిది. శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, శివాజీ... ఇలా చాలామంది అప్పటి యువహీరోలు చిరంజీవి అభిమానులే. బాలీవుడ్ హీరో గోవిందా కూడా తాను చిరంజీవి అభిమానని చెప్పుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడున్న హీరోల్లో అలా హీరోలు సైతం అభిమానించే హీరో అంటే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణే అనాలి. నేడున్న చాలామంది హీరో యువ హీరోలకు పవర్ స్టారే ఇన్ స్పిరేషన్. ముఖ్యంగా హీరో నితిన్. తన ప్రతి సినిమాలో పవన్ డైలాగో, లేక పాటో ఏదో ఒకటి ఉండేలా చూసుకుంటాడు. రీసెంట్ గా తన ఆఫీస్ లో కూడా పవర్ స్టార్ ఫొటోను పెట్టుకున్నారు. దీన్ని బట్టి నితిన్ కి పవన్ అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
