నితిన్ కు నోరూరించే గిఫ్ట్ పంపిన పవన్..!
on May 30, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నితిన్ ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్ అన్నది అందరికీ తెలిసిందే. పవన్ కు నితిన్ అంటే అంతే ఇష్టం. నితిన్ ను తన తమ్ముడిలా భావిస్తుంటారు పవన్ కళ్యాణ్. అంతేకాదు. ప్రతీ ఏడాది తన ఫాం హౌస్ లో పండిన మామిడిపళ్లను ప్రత్యేకంగా నితిన్ కోసం ప్యాక్ చేసి పంపిస్తుంటారు. లేటెస్ట్ గా నితిన్ సినిమా అ..ఆ రిలీజ్ కు రెడీ అవుతున్న సందర్భంగా, సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ బంగినపల్లి మామిడిపళ్ల బుట్టను నితిన్ కు పంపించారు పవన్.
స్వయంగా పళ్ల బుట్టపై, ఆల్ ది బెస్ట్ నితిన్ గారూ. ఫ్రమ్ పవన్ కళ్యాణ్ అని రాయడం విశేషం. ఈ ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు నితిన్. పవన్ కు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ప్రతీ ఏడాది వేసవి సీజన్లో మామిడి పళ్లను ప్రత్యేకంగా ఆయన సెలక్ట్ చేసి కొంతమందికి పంపడం రివాజుగా వస్తోంది. ఆ కొద్ది మంది సన్నిహితుల్లో నితిన్ కూడా ఒకరు. సినిమా విషయానికొస్తే, అ..ఆ జూన్ 2 న విడుదలకు సిద్ధంగా ఉంది. త్రివిక్రమ్ కాంబినేషన్లో చేస్తున్న ఈ మొదటి సినిమా హిట్ కొడతానని కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు నితిన్. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.