చరణ్ కోసం పవన్ త్యాగం.. సూపర్
on Oct 28, 2015
ప్రస్తుతం రామ్ చరణ్ కి కాలం కలిసిరానట్టుగా ఉంది. అప్పుడెప్పుడో వచ్చిన మగధీర సినిమా రికార్డుల్ని బద్దలు కొట్టగా.. ఆతర్వాత వచ్చిన చెర్రీ సినిమాలు అంత ఆశించిన స్థాయిలో లేవు.. రీసెంట్ గా భారీ అంచనాలతో విడుదలైన బ్రూస్లీ సినిమా అయితే డిజాస్టర్ గా నిలిచింది. తనతో పాటు ఉన్న కుర్ర హీరోలు అడపా దడపా హిట్ లు అందుకుంటుంటే చెర్రీ మాత్రం కాస్త వెనుకబడ్డాడనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చెర్రీ విషయంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ కాస్త శ్రద్ద తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. తన సినిమాను సైతం త్యాగం చేసి చెర్రీకి అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే పవన్ నిర్మాతగా, చరణ్ హీరోగా సినిమా వస్తుందని వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ని రామ్ చరణ్ తో సినిమా తీయడానికి ఒప్పించారట పవన్. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ చాలా సన్నిహితంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఓ కథ చర్చకు రాగా అది పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చి ఇది చరణ్ తో తీయండి అని చెప్పారంట. దానికి త్రివిక్రమ్ కూడా ఓకే అన్నారంట. అయితే ఈ సినిమాకి ముందే త్రివిక్రమ్ పవన్ తో సినిమా తీయాల్సి ఉంది. అయితే తన సినిమా కంటే చరణ్ సినిమానే కీలకమని.. తనతోనే ముందు సినిమా తీయమని పవన్ త్రివిక్రమ్ కు చెప్పారంట. మొత్తానికి అబ్బాయి కోసం బాబాయ్ చేసిన త్యాగం సూపర్..

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
