రేయ్‌పై పవన్ అభిమానులు గుస్సా!!
on Mar 28, 2015
రేయ్ విడుదలకు ముందు పవన్ నామజపం అరివీరభయంకరంగా చేశాడు వైవిఎస్ చౌదరి. పవన్ వల్లే ఈ సినిమా గట్టెక్కిందని, ఆయనే తమందరికీ స్ఫూర్తినిచ్చారని, అందుకు కృతజ్ఞతగా పవనిజం పాటని తెరకెక్కిస్తున్నామని, అది పవన్ అభిమానులకు అంకితం అని.. ఏవేవో మాటలు చెప్పాడు. దాంతో ఆటోమెటిగ్గానే పవన్ అభిమానులు ఈ సినిమా వైపు అట్రాక్ట్ అయ్యారు. పవనిజం పాట తెరకెక్కించి విడుదలయ్యేలోగా ఈసినిమాలో కలిపేస్తానని కబుర్లు చెప్పాడు వైవిఎస్. అయితే ఇదంతా బిజినెస్ ట్రిక్కే అనే విషయం అర్థమైంది. తొలి రోజు రేయ్‌లో పవనిజం పాట లేదు. ఇప్పుడు ఈ పాటని షూట్ చేస్తాడన్న నమ్మకం లేదు. దాంతో పవన్ అభిమానులు వైవిఎస్ తీరుపై చిరుబురులాడుతున్నారు. `మమ్మల్ని మోసం చేశాడ`ని ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ అభిమానుల నెగిటీవ్ పబ్లిసిటీ ఈ సినిమాకి చేటు తెచ్చే ప్రమాదం ఉంది. మరి చౌదరి ఫ్యాన్స్‌కి ఏం సమాధానం చెబుతాడో..?