క్రికెట్ గ్రౌండ్‌గా మారిన బాహుబలి-2 సెట్..
on Aug 31, 2016
ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. పిల్లల నుంచి పెద్దల దాకా అంతా వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా చాలా సంస్థలకు తీవ్ర నష్టం కలగ్గా ఇప్పటి వరకు ఏడుగురు చనిపోయారు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ సినిమా షూటింగ్‌లకు కూడా వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి..ది కన్‌క్లూజన్. ఈ సినిమాలో అత్యంత కీలకమైన యుద్ధ సన్నివేశాలను ప్రత్యేక సెట్లో చిత్రీకరిస్తున్నారు. వర్షం కారణంగా సెట్ వేసిన ప్రదేశంలో మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. దీంతో చేసేది లేక షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెట్‌ను యూనిట్ సభ్యులు క్రికెట్ గ్రౌండ్‌గా మార్చేశారు. క్రికెట్ ఆడుతుండగా తీసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు రాజమౌళి.