నారప్పకి డేట్ ఫిక్స్ అయిందా?
on Jan 22, 2021
గురు తరువాత విక్టరీ వెంకటేష్ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం నారప్ప. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ అసురన్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో వెంకీకి జోడీగా ప్రియమణి నాయికగా నటిస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. వేసవి కానుకగా నారప్పని విడుదల చేస్తున్నట్లు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో యూనిట్ ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 23ని నారప్పకి రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసినట్లు తెలిసింది. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
మరి.. గురు, ఎఫ్ 2, వెంకిమామ.. ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్న విక్టరీ వెంకటేష్.. నారప్పతోనూ ఆ పరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.