స్టార్ హీరోలకి భిన్నంగా నారా రోహిత్
on Oct 28, 2015
ఏడాదికి ఒక్క సినిమా తీయడానికే మన హీరోలు కిందా మీదా పడుతుంటే ఏకంగా తన చేతిలో తొమ్మిది సినిమాలు పెట్టుకొని హాట్ టాపిక్ అయ్యాడు నారా రోహిత్. ఒక పక్క సొంతంగా బ్యానర్ పెట్టి సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క హీరోగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నారా రోహిత్ నటించిన తుంటరి, శంకర సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దం కాగా.. ఇంకా పలు చిత్రాలు రోహిత్ ఖాతాలో ఉన్నాయి. కార్తికేయ ఫేం కార్తికేయ ఫేమ్ బివి శ్రీనివాస్ నిర్మిస్తున్న'కథలో రాజకుమారి' అనే సినిమాలో నటించేందుకు అంగీకరించాడు. దీనితో పాట పవన్ సాదినేని దర్శకత్వంలో రూపోందుతున్న 'సావిత్రి' సినిమాలోనూ ఇవికాక 'అప్పట్టో ఒకడుండేవాడు, వీరుడు, జ్యో అచ్యుతానంద, రాజా చేయ్యి వేస్తే' సినిమాలు రోహిత్ ఖాతాలో ఉన్నాయి. తీయడానికైతే తీస్తున్నాడు మరి ఈ సినిమాల్లో ఎన్ని సినిమాలు హిట్టవుతాయో.. ఎన్ని సినిమాలు ఫట్ అవుతాయో చూడాలి.