బాలకృష్ణకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు కూతుళ్లు
on Jun 12, 2017
నందమూరి బాలకృష్ణకి దిమ్మతిరిగే సర్ప్రైజ్ ఇచ్చారు కుటుంబ సభ్యులు. ఈ నెల 10 న పుట్టినరోజు జరుపుకున్న బాలకృష్ణ ప్రస్తుతం తన 101 వ చిత్రం పైసా వసూల్ కోసం పోర్చుగల్ లో షూటింగ్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఫేస్బుక్ లైవ్ చాట్ లో పాల్గొన్న బాలకృష్ణ ఆ రోజు షూటింగ్ లేదు కాబట్టి చిన్నగా పార్టీ ఇద్దాం అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆయనకి చెప్పకుండా ఆయన సతీమణి వసుంధర, పెద్ద కూతురు-అల్లుడు బ్రాహ్మణి-లోకేష్, చిన్న కూతురు-అల్లుడు తేజస్విని-శ్రీ భగత్ పోర్చుగల్ వెళ్లి పుట్టిన రోజు వేడుక ఘనంగా చేసారు. అంతేనా, బాలకృష్ణ కూతుళ్లు అయితే ఆయనకీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఇంతకీ అదేంటో తెలుసా... అత్యంత ఖరీదైన బెంట్లీ కార్. తల్లి పక్కనుండగా, కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్విని తండ్రి బాలకృష్ణకి కార్ తాలూకా కీస్ అందజేశారు. దీంతో బాలకృష్ణ ఆనందానికి ఆనందానికి అవధులు లేవంటే నమ్మండి. వాళ్ళు అంత దూరం తన కోసం ప్రత్యేకంగా రావడమే గొప్ప విషయమైతే, మంచి బహుమతి కూడా ఇవ్వడం బాలకృష్ణ ఆనందాన్ని రెట్టింపు చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
