నేనేంటీ.. ఆయన వయసేంటీ..? నాకు పెళ్లేంటీ..?
on Oct 18, 2017
బొద్దుగుమ్మ నమితకు అప్పట్లో టాలీవుడ్, కోలీవుడ్‌లలో మంచి క్రేజ్ ఉండేది. సహజంగానే భారీ అందాలను ఇష్టపడే తమిళ తంబిలు నమితను అమితంగా ఇష్టపడ్డారు. ఏకంగా గుడినే కట్టేసే రేంజ్‌లో అభిమానులను సంపాదించుకొంది నమిత. అయితే కొత్త హీరోయిన్లు రావడంతో నమితకు రాను రాను అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో అందరు మాజీ హీరోయిన్ల లాగానే నమిత కూడా సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకొని సెటిలైపోవాలనుకుందట. అల్రెడి ఒకరి ప్రేమలో తడిసిముద్దవుతోందట. దీనిలో ఏ మాత్రం తప్పులేదు. అయితే నమిత పెళ్లీ విషయంలో తమిళ మీడియా రాతలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సీనియర్ నటుడు శరత్‌బాబుతో నమిత ప్రేమ వ్యవహారం నడుపుతున్నారని.. సహజీవనం చేస్తున్నారని.. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
60 ఏళ్ల వయసున్న శరత్‌బాబుకు ఇప్పటికే మూడు పెళ్లిళ్లతో పాటు ఇద్దరితో విడాకులు కూడా అయ్యాయి. అలాంటి వ్యక్తి మళ్లీ నమితను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రావడం అందరినీ షాక్‌కు గురిచేశాయి. దీనిపై స్పందించిన శరత్‌బాబు.. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు.. తాను నమితను కలిసి 8 ఏళ్లు అయ్యింది. అలాంటప్పుడు తమ మధ్య ఇలాంటి వ్యవహారానికి ఆస్కారం లేదన్నారు. తనకు అసలు మళ్లీ పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదని.. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే అందరికి తెలియజేస్తానన్నారు. తాజాగా ఈ ప్రచారం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడింది నమిత. ఆయన వయసేంటి..? నా వయసేంటి..? ఇంత సిల్లీగా ఎలా పుకార్లు పుట్టిస్తున్నారు..? ఎలా ఈ విధంగా ఆలోచించగలుగుతున్నారు.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.