ముమైత్.. ఏంటా ఫొటోలు..?
on Apr 29, 2015
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే... అంటూ కుర్రకారుని ఉర్రూతలూగించింది ముమైత్‌ఖాన్. ఆ ఒక్క పాటతో ఐటెమ్ పాటల రారాణి అయిపోయింది. పోకిరి నుంచి ముమైత్ స్టార్ డమ్ తిరిగింది. ప్రతీ స్టార్ హీరో సినిమాలోనూ ముమైత్ పాట ఉండాల్సిందే. ఆ హవా ఓ రెండేళ్లు కొనసాగింది. ఆ తరవాత హీరోయిజం కూడా చూపించింది. వ్యాంప్ పాత్రలు పోషించింది. క్రమేపీ ముమైత్ క్రేజ్ తగ్గింది, కొత్త భామలొచ్చారు, వాళ్లతో పోటీ నిలదొక్కుకోలేకపోయింది. కొంతకాలంగా ముమైత్ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు సడన్‌గా ట్విట్టర్లో ప్రత్యక్షమైంది. బాడీ షేప్ మార్చి, బరువు తగ్గి, స్లిమ్ అయ్యింది. తన సెక్సీ ఫొటోల్ని... ట్వీట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏంటి? ముమైత్ ఇలా మారిపోయిందేంటి? అని అందరూ ఆశ్చర్యపోయేలా ఫిగర్ మార్చుకొంది. ముమైత్ ట్విట్టర్‌లో ని ఈ ఫొటోలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీగా మారాయి. ఇవి చూసైనా తనకు అవకాశాలిస్తారని ముమైత్ ఆశపడుతోంది. మరి... ఈ ఆశలు నెరవేరతాయో లేదో చూడాలంటే.. కొన్ని రోజులు ఓపిక పట్టాలి. ఆల్ ది బెస్ట్.. బంగారు కోడి పెట్ట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
