రానా అత్తయ్య కన్నీళ్లు పెట్టుకున్న వేళ...
on Aug 7, 2020
భారతీయ సంస్కృతిలో పెళ్లిళ్లనేవి ఎంతటి భావోద్వేగాల్ని కలిగిస్తాయో మనకు తెలుసు. ఆనందాలు, సంబరాలు, కేరింతలతో పాటు కన్నీళ్లు వచ్చే ఒక సందర్భం.. పెళ్లి! అవును. ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్లిపోతుందనే ఆలోచన మెదలగానే అమ్మాయి తల్లిదండ్రులకు, ఆమె తోబుట్టువులకు కన్నీళ్లు రాకుండా ఉంటాయా! ఇప్పుడు రానా కాబోయే భార్య మిహీకా బజాజ్ ఇంటివాళ్ల పరిస్థితి కూడా అదే. రానాకు కాబోతున్న అత్తయ్య బంటీ బజాజ్ కళ్ల వెంట నీళ్లు తిరిగాయంట.
గురువారం మిహీకా ఇంట్లో పసుపు కుంకుమ వేడుక జరిగింది. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం తన తల్లి పెళ్లి దుస్తులను ధరించింది మిహీక. ఆ దుస్తుల్లో కూతుర్ని చూడగానే కన్నీళ్లు వచ్చేశాయని బంటీ తెలిపారు. మిహీకా ఫొటోను షేర్ చేసి, "నా పెళ్లి దుస్తుల్ని ధరించిన బేబీని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయాన"ని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆమె తెలిపారు. ఆ ఫొటోలో రెడ్ అండ్ గ్రే కలర్ లెహంగాలో దర్శనమిస్తోంది మిహీకా. అవి బంటీ బజాజ్ పెళ్లి దుస్తులన్న మాట. అయితే ఫంక్షన్లో మాత్రం ఆ దుస్తులతో కాకుండా పసుపుపచ్చ లెహంగాలో కనిపించింది మిహీకా.
రామానాయుడు స్టూడియోస్‌లో శనివారం (ఆగస్ట్ 8) రాత్రి 8:30 గంటలకు మిహీకా మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు రానా. 30 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరవుతున్నట్లు సమాచారం.
Also Read