చిరు తగ్గితే కానీ మొదలవ్వదా...?
on May 31, 2016
మెగాస్టార్ కత్తి ఎప్పుడు మొదలవుతుంది..? మెగాభిమానులందరి మదిలో ఉన్న ప్రశ్న ఇదొక్కటే. రోజుకో రూమర్ వినిపిస్తుండటం, ఏ పుకారు పైనా మెగా క్యాంప్ కానీ, వినాయక్ గానీ స్పందించకపోవడంతో ఫ్యాన్స్ కు కన్ఫ్యూజన్ మరింత పెరిగిపోతోంది. లేటెస్ట్ మూవీపై మరో రూమర్ హల్ చల్ చేస్తోంది. చిరు పాలిటిక్స్ లోకి వెళ్లాక అవుటాఫ్ షేప్ అయ్యారని, కనీసం పది కేజీలైనా తగ్గాలని వినాయక్ ఆయనకుముందే సూచించాడట. దీంతో బరువు తగ్గే ప్రాసెస్ లో చిరు బిజీగా ఉన్నా, డైలీ ఏదొక ప్రోగ్రామ్ తో బయటికి వస్తుండటంతో పూర్తిగా బరువు తగ్గడం కుదరట్లేదట. నాకు ఠాగూర్ టైంలో ఉన్న వెయిట్ కి వస్తే, స్టోరీ కి సెట్ అవుతుందని వినాయక్ స్పష్టం చేయడంతో, ప్రస్తుతం బరువు తగ్గడంపై దృష్టి పెట్టారట మెగాస్టార్. ఇదొక్కటే సినిమా ఆలస్యానికి కారణం అని అంటున్నారు. స్టోరీపై ఉన్న వివాదాన్ని కూడా చిరు ఇప్పటికే పరిష్కరించేసుకున్నారట. చిరు ఎప్పుడు తగ్గుతారో..మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
