సరికొత్త అవతారంలో మంచు లక్ష్మి
on Mar 30, 2015
మంచు లక్ష్మీ ప్రసన్న మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి మనకు తెలిసిందే. నటిగా, నిర్మాతగా, టీవీ షో వ్యాఖ్యాతగా తనకంటూ ఓ సెపరేట్ బ్రాండ్ సృష్టించుకొంది. 'మా' ఉపాధ్యక్షురాలిగానూ ఆమె బాధ్యతలు నిర్వహించబోతోంది. తాజాగా ఇప్పుడు మరో అవతారం ఎత్తింది. గాయనిగా ఆమె తన టాలెంట్ చూపించబోతోంది. మంచు లక్ష్మి నటిస్తూ, నిర్మించిన చిత్రం 'దొంగాట'. ఇందులో మంచు లక్ష్మి పాట పాడిందట. ఆమెతో పాటు... అడవి శేష్ కూడా గొంతుకలిపాడట. 'దొంగాట' ప్రమోషన్స్ కోసం ఈ పాటని రూపొందించారని తెలుస్తోంది. నటన, నిర్మాణం, గానం, వ్యాఖ్యానం.. త్వరలోనే దర్శకత్వం వైపు కూడా అడుగులేస్తుందేమో.. చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
