గిల్లికజ్జాలు పెట్టుకొంటున్న మహేష్ హీరోయిన్లు
on Jul 6, 2015
కథ.. అందులో నా పాత్ర నచ్చితే చాలు.. మా స్థానం ఏంటన్నది అడగం... అంటుంటారు కథానాయికలు. అయితే ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి. వాస్తవంలో మాత్రం ఆ స్థానం కోసమే గిల్లికజ్జాలు మొదలవుతాయి. ఇప్పుడు సమంత, కాజల్ మధ్య అదే జరుగుతోంది. వీరిద్దరూ బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు సరసన నటిస్తున్నారు. ఇందులో మూడో నాయిక ప్రణీత కూడా ఉంది. ప్రణీత అనగానే ఎలాగూ `సెకండ్ హీరోయిన్` అనే ముద్ర పడిపోయింది. ఈ సినిమాతో `మూడోనాయిక` కి పడిపోయింది.
ఇప్పుడు సమస్యల్లా తొలి స్థానం ఎవరిదనే. ఫామ్‌ని బట్టి చూస్తే సమంతకు, సీనియార్టిని బట్టి చూస్తే కాజల్‌కి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఈ విషయంలోనే ఈ కథానాయికలిద్దరూ దర్శకుడికి నిద్ర లేకుండా చేస్తున్నార్ట. `ఈ సినిమాలో నేనే కదా ఫస్ట్ హీరోయిన్ ` అంటూ అటు కాజల్, ఇటు సమంత ఫోన్లు చేసి మరీ విసిగిస్తున్నారట. `మీ ఇద్దరి పాత్రలూ సమానంగానే ఉంటాయి` అని చెబుతున్నా... `ప్రమోషన్లలో నాకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి` అంటూ కండీషన్లు పెడుతున్నార్ట.
సినిమాలో ముగ్గురు కథానాయికలుంటే ఎవ్వరికీ ప్రాధాన్యం ఉండదన్న భయం హీరోయిన్లది. అందుకే కాజల్, సమంత తెగ హైరానా పడిపోతున్నారు. మరి వీరిద్దరి భయాన్ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఎలా పోగొడతాడో చూడాలి.